ఆరోగ్యం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ హక్కును కాపాడే బదులు ప్రైవేటు ఆసుపత్రులకే అప్పగించడానికి ప్రయత్నిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తూ, పేదల ఆరోగ్యాన్ని లాభాల వ్యాపారంగా మార్చుతున్నారు.
పచ్చపత్రికలలో “రూ.25 లక్షల ఉచిత భీమా” అంటూ కొత్తగా చూపిస్తున్న పథకం అసలు వైఎస్సార్ జగన్ ప్రభుత్వ కాలంలోనే అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అదే పథకానికి తమ ముద్ర వేసుకోవడం తప్ప ఇంకేమీ కాదు.
దీంతో పేదలకు లభించాల్సిన నాణ్యమైన ఉచిత వైద్యం దెబ్బతింటుంది. లాభాల కోసం నడిచే ప్రైవేటు ఆసుపత్రుల ఆధీనంలోకి ప్రజల ఆరోగ్యాన్ని నెట్టేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ.
ఆరోగ్యం వ్యాపారం కాదు, హక్కు. ప్రజలు వాస్తవాలను గుర్తించి, ఆరోగ్యశ్రీని బలహీనపరిచే యత్నాలను ప్రశ్నించాల్సిన సమయం ఇది.