నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ సినిమా రిలీజ్ అకస్మాత్తుగా వాయిదా పడింది. ఈరోజే థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం హఠాత్తుగా ఆగిపోవడంతో బాలయ్య అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం… ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్న 14 రీల్స్ సంస్థ టెక్నీషియన్స్‌కు, అలాగే ఇతర ప్రొడక్షన్ హౌసులకు చెల్లించాల్సిన పాత బకాయిలు ఇంకా క్లియర్ కాలేదని తెలుస్తోంది. ఈ ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగానే రిలీజ్‌ను ముందుకు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
పెద్ద హీరో సినిమా కావడంతో ఇలాంటి లావాదేవీలను ముందుగానే సెటిల్ చేయాలి. రిలీజ్ ముందు గంటల్లో ఇబ్బందులు తలెత్తడం వలన సినిమాకి నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఒకసారి చిత్రం వాయిదా పడితే ప్రేక్షకుల ఆసక్తి తగ్గడం, హైప్ తగ్గిపోవడం సహజం. దాంతో కలెక్షన్లపై కూడా ప్రభావం పడొచ్చు.
ఇతర ఉదాహరణగా ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ కూడా పలుమార్లు వాయిదా పడటంతో హైప్ తగ్గి, కలెక్షన్లు దెబ్బతిన్నాయి. అదే పరిస్థితి ‘అఖండ 2’కు రాకుండా చూడాలంటే, పెండింగ్ అమౌంట్‌ను త్వరగా క్లియర్ చేయడం తప్పనిసరి అని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.
ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే ‘అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది?’అధికారిక క్లారిటీ రానప్పటికీ, బకాయిల సమస్యలు తొందరగా పరిష్కారమైతే మాత్రమే త్వరలో రిలీజ్ అవ్వే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేదంటే సినిమా మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.

