అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు భారీ దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి “సైకో” అంటూ నోరుజారిన బాలయ్యపై వైసీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “నెత్తిన విగ్గు, చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు. దేశంలోనే పెద్ద సైకో కావాలంటే బాలకృష్ణకు నేనే సర్టిఫికెట్ ఇస్తాను” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతగా బాధ్యత లేకుండా అసభ్య భాషలో మాట్లాడటం తప్పు అని ఆయన విమర్శించారు.
అదే సమయంలో యూకే వైసీపీ ప్రతినిధి ప్రదీప్ రెడ్డి చింత బాలకృష్ణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాలయ్య చేసిన సంభాషణ శైలిని ఎద్దేవా చేస్తూ, “ఇలా బండ బూతులు మేం కూడా తిట్టొచ్చా? అసలు ఇది ఎమ్మెల్యే స్థాయికి తగిన ప్రవర్తననా?” అని ప్రశ్నించారు. బాలయ్య డైలాగ్‌లను వెటకారంగా అనుకరిస్తూ గట్టి పంచ్‌లు వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పరిణామం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి టెన్షన్ పెరిగింది. ఒకపక్క వైసీపీ నేతలు బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తుంటే, మరోపక్క టిడిపి అనుచరులు మాత్రం బాలయ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ–టిడిపి వార్ మరింత వేడెక్కింది.
మొత్తంగా, బాలయ్య అసెంబ్లీలో చేసిన ఒక మాట.. రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.