వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయోగాత్మక విమానం ల్యాండ్ అయిన సందర్భంగా స్పందించిన ఆయన… ఈ ప్రాజెక్ట్‌కు తానే ప్రధానంగా కృషి చేసినట్టు చెప్పుకొచ్చారు. పార్లమెంటులో మాట్లాడటం, మంత్రులతో సమావేశాలు పెట్టడం ద్వారా సమస్యలను లేవనెత్తానని, విశాఖ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. “అందులో మీ గొప్పతనం ఏముంది విజయసాయిరెడ్డి గారు?” అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు. పార్టీ తరపున గెలిచి, పార్టీ ఇచ్చిన పదవితోనే రాజ్యసభలో మాట్లాడిన విషయాన్ని మరిచి… మొత్తం క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ నేతల వాదన స్పష్టంగా ఒకటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్ట్‌కు దిశా నిర్దేశం జరిగిందని, కర్త–కర్మ–క్రియ అన్నీ ఆయనేనని చెబుతున్నారు. కేంద్రంతో చర్చలు, అడ్డంకుల తొలగింపు, భూసేకరణ నుంచి పాలసీ స్థాయి నిర్ణయాల వరకు జగన్‌దే కీలక పాత్ర అని స్పష్టం చేస్తున్నారు.
“టికెట్ ఇచ్చింది జగన్, ఎంపీ పదవి ఇచ్చింది జగన్. వైసీపీ తరపునే మీరు రాజ్యసభలో మాట్లాడారు. అలాంటప్పుడు పార్టీని, నాయకత్వాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత క్రెడిట్ తీసుకోవడం సరికాదని” వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.
భోగాపురం విషయంలో మిగతావాళ్ల పాత్రను వారు వ్యంగ్యంగా అభివర్ణిస్తున్నారు. “ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి చేసినట్టే… అసలు పని చేసింది ఒకరే, హడావిడి చేసిన వాళ్లు వేరే” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మొత్తానికి భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌పై మొదలైన ఈ వివాదం… వైసీపీ అంతర్గత రాజకీయాల్లో మరోసారి కాకరేపుతోంది. క్రెడిట్ ఎవరిది అన్న ప్రశ్నకు పార్టీ శ్రేణులు మాత్రం ఒకే మాట చెబుతున్నాయి — అన్నీ జగన్‌దే, మిగతావాళ్లది హడావిడే!


