జగన్ పై పగతో రగిలిపోతున్న రఘురామకృష్ణరాజుకు నిద్ర పట్టడం లేదు. జగన్ ను ఎలాగైనా మళ్లీ జైలుకు పంపాలన్న ఆయన కసి నిద్రపోనివ్వడం లేదు. అందుకే కోర్టుల్లో పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆయనకు ఊరట దక్కడం లేదు. తాజగా మరో బిగ్ షాక్ తగిలింది.
రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు తాజా తీర్పుతో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌ను ధర్మాసనం స్పష్టంగా తోసిపుచ్చింది. అదనంగా, సీబీఐ కేసులను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది.
ఈ తీర్పుతో రఘురామ ప్రయత్నాలు కొంతకాలం పాటు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు, ముఖ్యంగా “మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా?” అనే ప్రశ్న, రఘురామ న్యాయవాద ధోరణిపై కోర్టు అసహనం చూపించిందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
ఇది జగన్‌కు న్యాయపరమైన గెలుపుగా భావించవచ్చు. అదే సమయంలో రఘురామకు తమ వ్యూహాలను మళ్లీ పునరాలోచించుకునే అవసరం ఉందని సూచిస్తోంది.