Top Stories

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

 

బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ షో ప్రేక్షకుల్లో మొదట భారీ హైప్ క్రియేట్ చేసింది. సామాన్యులకి బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంట్రీ ఇవ్వడానికి ఇది ఓ ప్రత్యేకమైన ఆడిషన్ ప్రాసెస్ అని చెప్పబడింది. కానీ వాస్తవానికి మాత్రం షో ప్రేక్షకుల అంచనాలకు అందలేకపోయింది. కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేసే విధానం పూర్తిగా స్క్రిప్టెడ్ లాగా ఉందని, నిజమైన టాలెంట్ ఉన్న వాళ్లను పక్కన పెట్టి, ముందుగానే నిర్ణయించుకున్న వారినే సెలెక్ట్ చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా చివరి నాలుగు మందిని ఎంపిక చేసిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతోంది.

– ఫైనల్ రేసులో ఉన్న 15 మంది కంటెస్టెంట్స్

ఇప్పటికే చివరి రౌండ్‌కి చేరిన 15 మంది కంటెస్టెంట్స్.. ప్రసన్న కుమార్, పవన్ కళ్యాణ్ పడాలా, దమ్ము శ్రీజా, నాగ ప్రశాంత్, మనీష్ మర్యాద, హరీష్ (మాస్క్ మ్యాన్), అనూష రత్నం, దాలియా షరీఫ్, కల్కి, డెమోన్ పవన్, ప్రియా శెట్టి, సయ్యద్ షకీబ్, శ్రేయ, శ్వేతా శెట్టి, దివ్య. వీళ్ళకు ఓటింగ్ జియో హాట్‌స్టార్‌లో ప్రారంభమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం.. ప్రసన్న కుమార్ అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత దమ్ము శ్రీజా రెండో స్థానంలో దూసుకుపోతోంది.

– దమ్ము శ్రీజా హైలైట్

మొదట్లో ఆడిషన్స్‌లో జడ్జీలు, ప్రేక్షకులకు చిరాకు కలిగించిన దమ్ము శ్రీజా, ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో జడ్జీలు అన్యాయం చేసినప్పటికీ ధైర్యంగా ఎదురు నిలిచింది. ఆ సన్నివేశం వల్ల ఆమె పేరు ఒక్కసారిగా బలంగా జనాల్లోకి వెళ్లింది. అందుకే ఇప్పుడు ఓటింగ్‌లో విపరీతమైన మద్దతు లభిస్తోంది.

– టాప్ రేస్‌లో మరినివారు

టాప్ 2 తర్వాత జవాన్ పవన్ కళ్యాణ్ పడాలా, ప్రియా శెట్టి, శ్వేతా శెట్టి వంటి వారు ఉన్నారని సమాచారం. అయితే పెద్ద షాక్ ఏమిటంటే – టాప్ ఓటింగ్‌లో ఉన్న ప్రసన్న కుమార్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాడు. అతను బయటకు వచ్చి కొన్ని ఇంటర్వ్యూల్లో తన అనుభవాలు కూడా పంచుకున్నాడు.

మిగిలిన 15 మందిని మూడు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్‌కి ఒక జడ్జిని నిర్ణయించారని తెలుస్తోంది. ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఆ ప్రక్రియ బయటపడనుంది. ఇప్పటి వరకు జడ్జీల నిర్ణయాలు న్యాయం చేయలేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, రాబోయే ఎపిసోడ్స్ ఆ అపవాదులను తుడిచేస్తాయా? లేక మరింత వివాదాలకు దారి తీస్తాయా? అనేది చూడాలి.

మొత్తానికి ప్రసన్న కుమార్ ఎలిమినేషన్ ఒక మిస్టరీగా మారితే దమ్ము శ్రీజా రైజ్ మాత్రం ప్రస్తుతం అగ్నిపరీక్షలో హాట్ టాపిక్‌గా మారింది.

Trending today

పవన్ కళ్యాణ్‌కు మళ్లీ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహబూబ్‌నగర్...

పవన్ కళ్యాణ్ మాజీ భార్య సన్యాసం..

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య,...

తెలంగాణ నేతలపై జనసేన అరుణ సెటైర్లు

కోనసీమ కొబ్బరికి తెలంగాణ నేతల 'దిష్టి' తగిలిందంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి చేసిన...

పేర్ని నాని చాలెంజ్.. పవన్, లోకేష్ సమాధానం చెప్పండి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి విమాన ప్రయాణ ఖర్చుల వివాదంతో వేడెక్కాయి. మాజీ...

‘ఎయిడ్స్’పై ఓపెన్ అయిన బాబు.. వీడియో

గతంలో ఎయిడ్స్ అనే పేరు వింటేనే ప్రజలు భయపడి పారిపోయేవారు. ముఖ్యంగా...

Topics

పవన్ కళ్యాణ్‌కు మళ్లీ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహబూబ్‌నగర్...

పవన్ కళ్యాణ్ మాజీ భార్య సన్యాసం..

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య,...

తెలంగాణ నేతలపై జనసేన అరుణ సెటైర్లు

కోనసీమ కొబ్బరికి తెలంగాణ నేతల 'దిష్టి' తగిలిందంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి చేసిన...

పేర్ని నాని చాలెంజ్.. పవన్, లోకేష్ సమాధానం చెప్పండి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి విమాన ప్రయాణ ఖర్చుల వివాదంతో వేడెక్కాయి. మాజీ...

‘ఎయిడ్స్’పై ఓపెన్ అయిన బాబు.. వీడియో

గతంలో ఎయిడ్స్ అనే పేరు వింటేనే ప్రజలు భయపడి పారిపోయేవారు. ముఖ్యంగా...

తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపో పవన్ కళ్యాణ్

కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ల 'దిష్టి' తగిలిందన్న ఏపీ డిప్యూటీ...

టీడీపీ కోట్లకు కోట్లు పంచేసిందిలా..

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాలు, సభలు,...

‘ఐరన్ డోమ్’కి మించిన రక్షణ కవచం

ఇజ్రాయెల్ అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు ఐరన్ డోమ్ . శత్రువుల...

Related Articles

Popular Categories