టెలివిజన్ రంగంలో రికార్డులు సృష్టించిన రియాల్టీ షో బిగ్ బాస్ ఒక్కో సీజన్ వెనక భారీ ఖర్చులు, అంతకు మించిన లాభాలు దాగి ఉంటాయి. సమాచారం ప్రకారం, ఒక సీజన్ నడిపేందుకు సుమారు ₹5 నుండి ₹6 కోట్లు ఖర్చవుతాయి. ఇందులో హోస్ట్‌కి ఇచ్చే రెమ్యునరేషన్, కంటెస్టెంట్ల వారం వారానికి ఇచ్చే పారితోషికం, విజేతకు అందించే ప్రైజ్ మనీ, టెక్నికల్ టీం వేతనాలు, అన్నపూర్ణ స్టూడియోలో సెట్ ఖర్చులు అన్నీ కలిపి ఈ మొత్తం అవుతుంది.
అయితే, ఈ షోకి వచ్చే ఆదాయం మాత్రం దాదాపు ₹15 కోట్లకు పైగా ఉంటుంది. టిఆర్పి రేటింగ్స్, హాట్‌స్టార్ స్ట్రీమింగ్ రైట్స్, అడ్వర్టైజ్‌మెంట్స్, స్పాన్సర్‌షిప్స్ ద్వారా షో యజమాన్యం బంపర్ కలెక్షన్ రాబడుతోంది. అంటే మొత్తం ఖర్చును తీసేసినా, ఒక్క సీజన్‌కి సుమారు ₹9 కోట్ల వరకు లాభం వస్తున్నట్టుగా అంచనాలు ఉన్నాయి.
100 రోజుల పాటు నిరంతరంగా ఒక షోని విజయవంతంగా నడపడం సులభం కాదు. అందుకే ఈ షోకి ప్రత్యేకమైన ప్లానింగ్, డైరెక్షన్ టీం సంవత్సరం పొడవునా కష్టపడటం జరుగుతోంది. ఒకప్పుడు రిస్క్‌గా భావించిన భారీ ఇన్వెస్ట్‌మెంట్, ఇప్పుడు బిగ్ బాస్ సక్సెస్‌తో టెలివిజన్ రంగంలో లాభదాయకమైన బిజినెస్ మోడల్‌గా మారింది.