బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో నిన్నటి ఎపిసోడ్ ప్రేక్షకులను పట్టు వదలకుండా చూసేలా చేసింది. అక్కినేని నాగార్జున ఈసారి హోస్టింగ్‌లో అసలు కాంప్రమైజ్ లేకుండా కంటెస్టెంట్స్ అందరినీ ఉతికి ఆరేశారు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఎత్తిన పాయింట్స్ అన్నింటినీ పట్టుకుని మాట్లాడిన తీరు “ఇదే నిజమైన హోస్టింగ్” అనిపించింది.
ప్రత్యేకంగా దివ్వెల మాధురి, సంజనల ప్రవర్తనపై నాగ్ క్లాస్ మరో లెవెల్‌లో సాగింది. “ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ అందరూ ఒక్కటే” అంటూ వారిని గట్టిగా హెచ్చరించిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీతూ చౌదరి విషయంలో కొంత సాఫ్ట్‌గా వ్యవహరించడం కొందరికి అంతగా నచ్చలేదు.
సంజన విషయంలో నాగార్జున గట్టిగా మాట్లాడిన తీరు హైలైట్ అయింది. నోరు అదుపు లేకుండా మాట్లాడడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం ఆమెకు అలవాటైందని ప్రేక్షకుల అభిప్రాయం. అందుకే నాగ్ ఆమెకు “వారం రోజుల పాటు మాట్లాడకూడదు” అనే శిక్ష విధించాడట.
ఇక తనూజ, రాము మధ్య జరిగిన సన్నివేశాన్ని చూపిస్తూ నాగ్ తీర్పు చెప్పిన తీరు కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్‌లో నాగార్జున తన హోస్టింగ్ స్కిల్స్‌తో షోని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు అనడంలో సందేహం లేదు.

