ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రచారం ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఆయన ఢిల్లీకి వెళ్లడం లేదని, బీజేపీ పెద్దలతో గ్యాప్ పెరిగిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవం మాత్రం వేరేలా ఉంది.
దక్షిణాది రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కి పవన్ కీలకం. ఉత్తరాదిలో ఎదురైన లోటును ఏపీ–తెలంగాణ రాష్ట్రాలే పూడ్చాయి. అందుకే ఎన్డీఏకు ఏపీ నుంచి వచ్చిన సీట్లు బీజేపీకి పెద్ద బలం అయ్యాయి.
పవన్‌కు ఉన్న సినీ గ్లామర్, సామాజిక వర్గాల మద్దతు, ప్రజాదరణ బీజేపీకి ఎంతో అవసరం. ఆయన తరచూ ఢిల్లీ వెళ్లకపోయినా, ఏపీ నుంచే బీజేపీ కేంద్ర నాయకత్వంతో సమన్వయం కొనసాగుతోందని రాజకీయ వర్గాల మాట.
అందుకే పవన్‌ను బీజేపీ వదులుకుంటుందన్న ప్రచారానికి బలం లేదు. తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ బీజేపీకి అవసరం మరింత పెరుగుతోందన్నదే స్పష్టమైన నిజం.


