Top Stories

పవన్ కళ్యాణ్ ఈ కన్నీళ్లు మీకు కనపడవా.?

‘రాష్ట్రంలో 33 వేల మందికి పైగా ఆడపిల్లలు కనిపించకుండా పోయారు.? వారిని కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.? వాలంటీర్ల ద్వారా వారంతా బయటకు వెళుతున్నట్లు తనకు సమాచారం ఉంది’ ఇవి ప్రస్తుత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు. వైసిపి ఏర్పాటు చేసిన వాలంటీర్లే వీరంతా బయటకు వెళ్ళిపోయేందుకు కారణం అవుతున్నారనే రీతిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముగిసిపోయాయి.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిదు నెలలు దాటిపోయింది. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కూడా లేకుండా పోయింది. మరి ఈ ఐదు నెలల కాలంలో కూడా పదుల సంఖ్యలో ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుండగా, వందలాదిమంది ఆడబిడ్డలు కనిపించకుండా పోయారు. మరి వీటి గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించడం లేదు. పదుల సంఖ్యలో మిస్సయిన ఆడపిల్లల ఎక్కడికి వెళ్లినట్లు? గతంలో వాలంటీర్లను బాధ్యులుగా చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిస్ అయిన ఆడపిల్లలకు ఎవరు కారణం అన్న విషయాన్ని కూడా చెప్పాల్సిందే అన్న డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా పత్తిపాడుకు చెందిన ఒక యువతని కాలేజీ నుంచి ఎవరో తీసుకెళ్లిపోయారంటూ సదరు యువతీ తల్లిదండ్రులు మీడియా ముకుంగా బయటకు వచ్చి కన్నీరు మున్నీరు అయ్యారు.

పవన్ కళ్యాణ్ గారు తమ బిడ్డను వెతికి తెచ్చి ఇవ్వండి అంటూ మొరపెట్టుకున్నారు. 16 రోజులు అవుతున్న తన బిడ్డ ఆచూకీ కనిపెట్టలేదంటూ సదరు తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తితో ప్రిన్సిపల్ తమ బిడ్డను పంపించేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వచ్చి అడిగిన స్పందించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసామని వెతుకుతున్నామని చెబుతున్నారే తప్ప పట్టించుకోవడం లేదన్నారు. తన బిడ్డ ఉందో, చంపేశారో కూడా అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆ తల్లి. పోలీసులు అశ్రద్ధ చేస్తున్నారని వాపోయారు. మీరైనా గుర్తిస్తారని వేడుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ను ఆమె రెండు చేతులు జోడించి కోరారు. తన పాపను వెతికి తన వద్దకు చేర్చాలని ఆమె కోరారు. పాప రాకపోతే కుటుంబ సభ్యులమంతా చనిపోవడం ఏ తప్ప మాకు మరో దారి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సదరు తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను చూడండి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉండగా ఎన్నికల లబ్ధి కోసం తెగ ఊగిపోయిన డీసీఎం గారు దీనిపై ఏం మాట్లాడుతారో అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం మనది కాకపోతే బురద చల్లాలి, మనది అయితే చూసి చూడనట్లు సైలెంట్ గా ఉండాలి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వైఖరి ఉందంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. కుమార్తె కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న ఆ తల్లిదండ్రుల ఆవేదన వీడియోను మీరు చూడండి.

Trending today

దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో...

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

    కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా...

అఘోరి-శ్రీవర్షిణి పెళ్లి.. షాకింగ్ వీడియోలు

  మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో అఘోరీ మరియు శ్రీ వర్షిణి అనే...

గేదెలకు కుడితి కలుపుతున్న చంద్రబాబు.. వైరల్ వీడియో

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు...

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్...

Topics

దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో...

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

    కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా...

అఘోరి-శ్రీవర్షిణి పెళ్లి.. షాకింగ్ వీడియోలు

  మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో అఘోరీ మరియు శ్రీ వర్షిణి అనే...

గేదెలకు కుడితి కలుపుతున్న చంద్రబాబు.. వైరల్ వీడియో

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు...

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్...

కిరణ్ పాపం పండింది.. ఇదీ వైసీపీ విజయం

గుంటూరు పోలీసులు వైయస్ భారతి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో...

ఈ నీచుడిని అరెస్ట్ చేసి లోపలేయండి

  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారంలో ఉన్న కూటమి...

వైసీపీ వ్యతిరేకులు గుర్తుపెట్టుకోండి!

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరుస్తూ...

Related Articles

Popular Categories