‘బిగ్ బాస్ 9’ లోకి ఈసారి సామాన్యులను పంపే ప్రక్రియలో భాగంగా జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ షో మంచి హంగామా క్రియేట్ చేస్తోంది. లక్షలాది అప్లికేషన్లలోంచి ఎంపికైన 15 మందిలో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్లు ఓటింగ్ లో ఉన్నారు. వీరిలో ఐదుగురికి మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ లభించనుంది.
అయితే ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ టెన్షన్ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ‘అగ్నిపరీక్ష’ ద్వారా సామాన్యులకు ఏర్పడిన ఫ్యాన్ బేస్ ముందు తామే వెనకబడి పోతామేమో అన్న భయంతో కొంతమంది సెలబ్రిటీలు ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నారట. హీరో హర్షిత్ రెడ్డి, సీరియల్ నటుడు ముఖేష్ గౌడ్ లాంటి వారు తొలుత ఓకే చెప్పి, ఆ తర్వాత వెనక్కి తగ్గిన వారిలో ఉన్నారు.
ముఖ్యంగా దమ్ము శ్రీజా, హరీష్ వంటి కంటెస్టెంట్స్ గట్టి పోటీదారులుగా కనిపిస్తుండటంతో సెలబ్రిటీలు “హౌస్ లో వీళ్ళతో కాంక్రంట్ అవ్వడం కష్టమేమో” అనే భావనలో ఉన్నారట. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్లు ఇచ్చినా కొంతమంది ముందుకు రాకపోవడం బిగ్ బాస్ టీంకి చిన్న సవాల్ లా మారింది.
ఈ సారి సామాన్యుల ఎంట్రీ వల్లే బిగ్ బాస్ హౌస్ మరింత ఆసక్తికరంగా మారనుందని చెప్పొచ్చు.