భజన చేయుడి భక్తులారా అంటూ మోడీ విశాఖ టూర్ లో ఆయన భజన చేయడానికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరిమితమయ్యారు. చంద్రబాబు పొగడ్తలు అయితే ఢిల్లీ ఎన్నికల వరకూ వెళ్తాయి. అక్కడ ఎన్డీఏ గెలిచి తీరుతుందని అన్నారు. అక్కడ ఎన్డీఏ కూటమిగా పోటీ చేయడం లేదు. బీజేపీ మాత్రమే పోటీ చేస్తోంది. అదే సమయంలో మోదీని ప్రపంచ లీడర్ గా అభివర్ణించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మారారు. వైసీపీని అధికారం నుంచి దించి కూటమి ప్రభుత్వాన్ని ఏపీలో తేవడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అయితే పదేళ్ల నుంచి ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ కల్యాణ్ కేవలం జగన్ ను మాత్రమే ప్రశ్నిస్తూ పాలనలో లోపం జరిగినా, ప్రభుత్వ వైఫల్యం జరిగినా ఆయన పట్టించుకోవడం లేదు. ప్రశ్నించడం పూర్తిగా మానేసినట్లుందని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం పవన్ కల్యాణ్ పొగడ్తలకే పరిమితమయ్యారంటున్నారు. ఏడు నెలల కాలంలో కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపాన పోలేదన్న విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ అంటే సినీ హీరో గా అందరికీ అభిమానం ఉంటుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అటు ప్రదాని మోదీని.. ఇటు సీఎం చంద్రబాబును కూడా పొగిడారు. మోదీ దేశాన్ని.. చంద్రబాబు రాష్ట్రాన్ని దార్శనికుల్లా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. నారా లోకేష కూడా తన స్పీచ్‌లో మోదీని పొగిడేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఎన్నికల సభ కాదు. అయినా ఢిల్లీ ఎన్నికల కోసం అన్నట్లుగా రోడ్ షో, సభలు నిర్వహించారు.
ఇలా మోడీ భజనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పునీతులయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ పై ప్రశ్నించాల్సిన పాపాన పోలేదు. అందుకే కార్మిక సంఘాలు ఇప్పుడు బాబు, పవన్ లను పదవి కోసం ఇంత దిగజారుతారా? అంటూ విమర్శిస్తున్నారు.