Top Stories

బాబు బండారం బయటపెట్టిన రోశయ్య మాట

‘ఓడ దాటేదాక ఓడ మల్లయ్య.. ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య’ అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు ఉంటుందని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎన్నికల సమయంలో ఎన్నెన్నో హామీలను ఇస్తుంటారు. అధికారంలోకి రావడానికి అవసరమైతే ఆ చందమామను కూడా ఇంటింటికి ఇచ్చేస్తానని హామీలను చంద్రబాబు ఇచ్చేస్తారు. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలను అమలు చేయమని అడిగితే మాత్రం.. ఖజానా ఖాళీగా ఉందని, నిధులు ఎక్కడ నుంచి వస్తాయని తిరిగి ప్రశ్నిస్తుంటారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా ఇటువంటి మోసాలతోనే నెట్టుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అలవిగాని హామీలను ఇవ్వడం, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది.

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలను ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయమని అడుగుతుంటే ఖజానా ఖాళీగా ఉందంటూ కథలు చెబుతున్నారు. దీంతో చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన సాధారణ ప్రజలు నిను నమ్మడం మేము చేసిన తప్పు బాబూ అంటూ వాపోతున్నారు. అయితే, ఇదే విషయాన్ని గతంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయని రోశయ్య ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబు నాయుడు ఆకాశమే హద్దుగా అనేక వరాలు కురిపించారు. కనిపించిన ప్రతి ఒక్కరికి ఏం కావాలో కోరుకో నరుడా అన్నట్టుగా హామీలను ఇచ్చారు. తీరా ఎన్నికలు పూర్తయిన 15 రోజుల తర్వాత ఆర్థికంగా దివాలా తీసామని, రూపాయి కూడా లేదని చంద్రబాబు దివాలా కోరు వ్యాఖ్యలు చేశారంటూ రోశయ్య తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని, ఉద్యోగులకు జీతభత్యాలను ఎలా ఇవ్వాలో కూడా తెలియడం లేదంటూ పేర్కొన్న చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వాన్ని ప్రజలే భరించాలని, ప్రజలే నడిపించాలని వాడడం ద్వారా తన అసమర్ధతను అప్పట్లోనే చాటుకున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పిన ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదంటూ ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. రోశయ్య గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పాలనకు అడ్డంపడుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో మీడియాతో మాట్లాడి ఆయన ఈ హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో హామీలను ఇచ్చామని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీనిపై సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఎప్పుడో 20 ఏళ్ల కిందటే చంద్రబాబు నాయుడు నైజాన్ని గుర్తించి రోశయ్య వ్యాఖ్యానించారని.. చంద్రబాబు నాయుడు గురించి రోశయ్య నాడు చెప్పిన మాటలు ప్రస్తుతం అక్షర సత్యాలుగా మరోసారి అన్వయించే పరిస్థితి ఏర్పడిందని పలువురు పేర్కొంటున్నారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories