ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ తన టెక్నాలజీ ప్రావీణ్యం, పరిపాలనపై గర్వంగా వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి సూపర్‌పవర్ దేశం కూడా తుఫాన్లను సరిగ్గా మేనేజ్ చేయలేదని, అయితే తాను మాత్రం ఏపీలో తుఫాన్ల సమయంలో ప్రజలను, ఆస్తులను సమర్థంగా రక్షించగలిగానని మీడియా సమావేశంలో తెలిపారు.
“నేను వాడే టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు… నా లాంటి ప్లానింగ్ ఎవరికీ సాధ్యం కాదు” అని చంద్రబాబు గర్వంగా చెప్పడంతో, సోషల్ మీడియాలో మాత్రం వ్యంగ్యాలు వెల్లువెత్తుతున్నాయి.
నెటిజన్లు ఈ వ్యాఖ్యలను పంచుకుంటూ “అలాగే కానీయ్ తాత… నువ్వే తుఫాను ఆపగలవు!” “ఇకపోతే నాసా నిన్ను అడ్వైజర్‌గా తీసుకోవాలి!”.. “తుఫాన్ వస్తే బాబు సిగ్నల్ ఆఫ్ చేస్తాడు!” అంటూ మీమ్స్, కామెంట్లతో సోషల్ మీడియాను నింపేశారు.
చంద్రబాబు గతంలోనూ తన టెక్నాలజీ ప్రేమ, విజన్ 2020, ఈ-గవర్నెన్స్ వంటి అంశాలను తరచూ ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఈసారి అమెరికాను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు కొత్త వినోదాన్ని అందిస్తున్నాయి.
ట్రోల్ వాతావరణం తుఫాన్ కంటే ఎక్కువగా వీచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు!

