Top Stories

అచ్చెన్న పరువు తీసిన బాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య సరదా సంభాషణ నవ్వులపాలైంది. విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్న నేపథ్యంలో, చంద్రబాబు అచ్చెన్నాయుడును ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా జరిగిన ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడుని ఉద్దేశించి “నీ పర్సనాలిటీకి యోగా చేయలేవు.. నువ్వు విశాఖలో ప్రధాని మోడీ పాల్గొనే యోగా దినోత్సవంలో పాల్గొనకపోతేనే బెటర్” అని వ్యంగ్యంగా అన్నారు. అక్కడే ఉన్న అధికారుల సమక్షంలోనే బాబు ఈ వ్యాఖ్యలు చేయడంతో, అచ్చెన్నాయుడు కాస్త అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది.

ఈ వ్యాఖ్యల పరంపర అక్కడితో ఆగలేదు. “నువ్వు ఆకాశంలో ఉన్నావ్, నువ్వు కూడా యోగ దినోత్సవానికి రాకపోతేనే బెటర్” అంటూ చంద్రబాబు మరోసారి అచ్చెన్నాయుడిపై సెటైర్లు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం యోగా దినోత్సవానికి సంబంధించినవిగా కాకుండా, అచ్చెన్నాయుడి రాజకీయ ప్రాభల్యం, అధికారిక వ్యవహారాలపై పరోక్ష విమర్శలుగానూ కొందరు విశ్లేషిస్తున్నారు. అచ్చెన్నాయుడు ఇటీవలి కాలంలో కొన్ని అంశాలపై ముఖ్యమంత్రితో విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో, ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఏ మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి. అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/UttarandhraNow/status/1934990021041553840

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories