Top Stories

పబ్లిసిటీ ఆపి సాయం చేయండి బాబు, లోకేష్

ఏపీలోని బోగోలు మండలం పాత బిట్రగుంట గిరిజన కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో కాలనీ మొత్తం నీట మునిగిపోయి, ఇళ్లలో నీరు చేరడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

స్థానికుల ప్రకారం, తుపాను విరుచుకుపడినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వ అధికారి కాలనీకి రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, తాగునీరు, విద్యుత్ సరఫరా లేక ప్రజలు కష్టాల్లో ఉన్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

“ప్రతి టీవీ ఛానెల్‌లో పబ్లిసిటీ షోలు చేస్తూ తుపానుపై ఎలివేషన్‌ చూపించడమే కాకుండా, మేము ఎదుర్కొంటున్న పరిస్థితిని కూడా సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు గమనించాలి. మాకు వెంటనే సహాయం అందించాలి” అని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

వెంటనే అధికారులు స్పందించి పాత బిట్రగుంట గిరిజన కాలనీని సందర్శించి, అవసరమైన ఆహారం, వైద్య సహాయం, తాత్కాలిక నివాస ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

తుపాను ప్రభావం తగ్గినప్పటికీ, మిగిలిన సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని బాధితులను ఆదుకోవాలని ప్రజల ఆకాంక్ష.

https://x.com/JaganannaCNCTS/status/1983407465216782853

Trending today

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

Topics

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

Related Articles

Popular Categories