సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా, ఇకపై పశువులకు కూడా హాస్టల్స్ రాబోతున్నాయి. నిజంగా ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఇప్పటివరకు పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులకే హాస్టల్స్ ఉండేవి. ఇప్పుడు పశువులకు కూడా ఆ భాగ్యం కలగబోతోంది. దీనిపై చంద్రబాబును సోషల్ మీడియాలో ఏసేసుకుంటున్నారు. ఇలాంటి చెత్త ఆలోచనలు మీకు ఎలా వస్తాయి బాబు గారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
పశువులు ఇంట్లో ఉండడం వల్ల ఎవరికి తెలియకుండా పశువుల యజమానులు వేపుడు, చికెన్ వంటివి తింటారు. కానీ హాస్టల్స్‌కి వెళితే ఇలాంటివి తినే అవకాశం ఉండదు. హాస్టల్స్‌లో పశువులు రోజు గడ్డి తిని ఫిట్‌గా, హెల్తీగా ఉంటారని చంద్రబాబు ప్రకటనపై సెటైర్లు వేస్తున్నారు.
పశువులకు మంచి షెడ్స్, ఏసీ సౌకర్యాలు, ఫ్యాన్లు ఉంటాయి. ఎండకి కష్టపడకుండా, సుఖంగా ఉంటారు. పశువుల హాస్టల్స్ లో మంచి టీచర్లు ఉంటారు. వారు పశువులకు లెక్కలు, తెలుగు నేర్పుతారు. ఇలా చేయండి బాబు గారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ పశువుల హాస్టల్స్ లో పిల్లలకు ఉండాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. పశువులు ఈ హాస్టల్స్ లో చదువుకుని, కష్టపడి పని చేసి, ఇంకా ఇంకా పశువులుగా తయారవ్వాలి. త్వరలోనే పశువులు కూడా కాలేజీలో, స్కూల్లో చదువుకుంటారని ఆశిద్దాం. ఇది బాబు గారి మదిలో వచ్చిన ఒక మంచి హైటెక్ ఆలోచన. దీనిపై ఇంకా చాలా పనులు చేయాలి. మన పశువులను మనమే అభివృద్ధి చేసుకోవాలి. బాబు గారి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.
https://x.com/greatandhranews/status/1969368103470710849