రాష్ట్రంలో రేషన్ పంపిణీ తీరుపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, సామాన్య ప్రజలు గంటల తరబడి రేషన్ షాపుల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్ బయోమెట్రిక్ విధానంలో తరచుగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఈ ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి.
గత జగన్ ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించేవారు. దీంతో ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండేదని, ఎటువంటి కష్టాలు లేకుండా రేషన్ పొందే వారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
“ప్రజల కొవ్వు కరిగిస్తున్న చంద్రబాబు… మీరు నాకు ఓటు వేసినందుకే ఇది రిటర్న్ గిఫ్ట్” అంటూ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు తీరుపై సామాన్య ప్రజల నుంచి, ముఖ్యంగా పేదల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రేషన్ పంపిణీ విధానం పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రజల కష్టాలు కళ్లకు కడుతున్నాయి..