ఈ వీడియో ఎలా మిస్ అయ్యామబ్బా!

నిన్న అంతా అల్లు అర్జున్ అరెస్ట్ పైనే వివాదం నడిచింది. అస్సలు ఎవరూ కూడా వేరే న్యూస్ వినలేదు.. కనలేదు. చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ అంటూ ఓ సమావేశం పెట్టడం అందులో పవన్ కళ్యాణ్ ఏకంగా చంద్రబాబు ను పొగడడానికే సరిపోయింది.

ఈ సభలో చంద్రబాబు, పవన్ చాలా సరదాగా కనిపించారు. ఒకరినొకరు చాలా సన్నిహితంగా మెలిగారు. ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ ఏదో చంద్రబాబు చెవిలో చెప్పగా.. ‘యూ చిలిపి’ అంటూ చంద్రబాబు స్వయంగా పవన్ నడుం గిల్లిన సన్నివేశం హైలెట్ గా నిలిచింది.

అసలు అల్లు అర్జున్ మాయలో పడిపోయి ఇంతటి అద్భుత సన్నిహిత వీడియోను ఎలా మిస్ అయ్యామని అందరూ షేర్లు చేస్తున్నారు. బాబు, పవన్ లు ఇంత సన్నిహితంగా మెలగడం.. నడుం గిల్లుకోవడం.. చెవులు కొరుక్కోవడం దేని గురించి అబ్బా అని ఆరాతీస్తున్నారు.

మొత్తంగా అల్లు అర్జున్ వివాదం పైననా? లేక వైసీపీ రైతు దీక్షలు డైవర్ట్ అయిపోయాయని మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఈ సన్నిహిత వీడియో మాత్రం వైరల్ అవుతోంది. మీరూ చూసి తరించండి..

వీడియో కోసం క్లిక్ చేయండి