విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తన స్టైల్లో హైదరాబాద్ అభివృద్ధిపై క్రెడిట్లు అన్ని తానే తీసుకునేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడమే కాకుండా, నెటిజన్లు వినోదంగా సెటైర్లు పేలుస్తున్నారు.
సభలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ అభివృద్ధి విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా అన్నారు. “హైదరాబాద్ బిర్యానీని ప్రపంచవ్యాప్తంగా నేనే ప్రమోట్ చేశాను” “ఓల్డ్ సిటీ పక్కనే ఎయిర్‌పోర్ట్ నేనే కట్టాను.. ఇతర ప్రాంతాల వాళ్లు ఓల్డ్ సిటీకి వెళ్లి షాపింగ్ చేసేలా ముత్యాలను నేనే ప్రమోట్ చేశాను.. నేను చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్ ముస్లింలు కోటీశ్వరులు అయ్యారు” అంటూ బాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు.
ఈ వ్యాఖ్యలు సామాన్య ప్రజలకే కాదు, సోషల్ మీడియా యూజర్లకు కూడా చిరునవ్వు తెప్పించాయి. ఇప్పటికే “ఐటీని నేనే డెవలప్ చేశా”, “హైదరాబాద్ నేనే కట్టా” అని పలుమార్లు చెప్పిన ఆయన, మరోసారి అదే స్టైల్‌లో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు వ్యాఖ్యలు బయటికొచ్చిన వెంటనే సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్లు వెల్లువెత్తాయి. కొంతమంది నెటిజన్లు “బిర్యానీ కూడా బాబు పెట్టాడా?” “చార్మినార్ కూడా బాబు కట్టించినట్టు మాట్లాడుతున్నాడు” “హైదరాబాద్ ముస్లింలందరూ కోటీశ్వరులైతే, అర నవాబులు ఇంకా హైదరాబాద్‌లోనే తిరుగుతున్నారు ఎందుకు?” అంటూ వినోదభరితమైన పోస్టులతో ట్రోల్స్ చేస్తున్నారు.


