Top Stories

పవన్ కళ్యాణ్ కు కౌంటర్: పిఠాపురం వర్మ సంచలన ట్వీట్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీలతో పాటు నాయకుల ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆయన కోసం తన సీటును త్యాగం చేసిన వర్మ ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ వర్మను అభినందించినప్పటికీ, ఆ తర్వాత వర్మ ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోయింది. ఆయనకు ఇచ్చిన పదవి హామీ కూడా నెరవేరలేదు. అంతేకాకుండా, పిఠాపురం నియోజకవర్గంలో జనసైనికులు కూడా తనను పెద్దగా పట్టించుకోవడం లేదని వర్మ భావిస్తున్నారు. దీంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. తనను గెలిపించిన పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కూడా వర్మ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు మంచి పట్టు ఉండేది. గతంలో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి బలమైన నాయకుడు 2024 ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేయాలని భావించారు. కానీ అదే స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోరడంతో, చంద్రబాబు విజ్ఞప్తి మేరకు వర్మ తన సీటును త్యాగం చేశారు. వర్మ కేవలం త్యాగం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ విజయం కోసం కూడా కృషి చేశారు. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపుతో వర్మకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడటం వర్మను బాధించింది. జనసేన ప్లీనరీ సమావేశంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ గెలుపులో ఎవరైనా ఉన్నారనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు వర్మను ఉద్దేశించే చేశారని అందరికీ అర్థమైంది. కానీ వర్మ మాత్రం అప్పుడు దానిపై స్పందించలేదు.

తాజాగా వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. గతంలో కూడా ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టగా అది వైరల్ అయింది. అయితే అది తాను పెట్టలేదని, తన సోషల్ మీడియా ఖాతాలను చూసుకునే ఏజెన్సీ ప్రతినిధులు పెట్టారని వర్మ తర్వాత చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం వర్మ స్పష్టమైన పోస్ట్ పెట్టారు. ఆ పోస్టర్‌లో “ప్రజలే నా బలం” అంటూ పెద్ద నినాదం ఉంచారు. అదే పోస్టర్‌పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు ఇతర కూటమి నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే ఈ ట్వీట్ ద్వారా వర్మ జనసేనకు గట్టి కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. తనకు ప్రజల్లో ఇంకా బలం ఉందని, తన శక్తి ఏమాత్రం తగ్గలేదని చెప్పేందుకే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Trending today

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

‘బాబు’ ఎల్లో మీడియా పంథా మారిందా?

టీడీపీ అధినేత చంద్రబాబు 'పంథా మార్చుకున్నాను' అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో...

మాజీ మంత్రి గుడ్‌ బై!

తెలుగుదేశం (టీడీపీ) పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏడుపులు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య జరిగే మాటల...

Topics

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

‘బాబు’ ఎల్లో మీడియా పంథా మారిందా?

టీడీపీ అధినేత చంద్రబాబు 'పంథా మార్చుకున్నాను' అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో...

మాజీ మంత్రి గుడ్‌ బై!

తెలుగుదేశం (టీడీపీ) పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏడుపులు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య జరిగే మాటల...

అఖండ 2 విడుదల ఎందుకు ఆగిపోయింది?

‘అఖండ 2’ విడుదలపై పెద్ద సందిగ్ధత నెలకొంది. బాలకృష్ణ – బోయపాటి...

ఏపీలో వైసీపీ సునామి.. నేషనల్ మీడియా రెడీ!

ఆంధ్రప్రదేశ్‌లో 2029 ఎన్నికల దిశగా వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్ రెడ్డి...

‘పచ్చ’ ముఠా కుట్రలు.. మళ్లీ మొదలెట్టింది..

వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కారుమూరు ‘పచ్చ’ ముఠాపై, ముఖ్యంగా నిన్న...

Related Articles

Popular Categories