2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు… తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని గాయం మిగిల్చిన రోజు. ఆ రోజు మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి మన మధ్య లేకపోవడం ప్రజలకు తట్టుకోలేని దెబ్బ అయింది.
ప్రజల కోసం బతికిన, వారి సమస్యలను తన సమస్యలుగా మలచుకున్న రాజన్న… నేటికీ ప్రతి ఇంటిలో ఆయన జ్ఞాపకాలు నిండే ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు… ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన సాక్ష్యాలు.
నాయకుడిగా మాత్రమే కాకుండా, తండ్రిగా, బంధువుగా, స్నేహితుడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన అరుదైన నేత రాజశేఖర రెడ్డి. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగు ప్రజలు “రాజన్న… మళ్లీ పుట్టవా?” అని వేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గమే నేటి తరాలకూ దారిదీపం. రాజన్న ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత.