రాజకీయ విశ్లేషణల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ (ఏబీఎన్ ఆర్కే) ఆదివారం రాసే “కొత్త పలుకు” కాలమ్ ఈ వారం పత్రికలో కనిపించలేదు. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతున్న వేళ ఆర్కే నిశ్శబ్దం ప్రదర్శించడంతో పాఠకుల్లో ఆసక్తి రేకెత్తింది.
రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన విమర్శల నుండి మోదీ విదేశీ పర్యటనలు, రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల బాగోతాలు, రైతు సమస్యలు వరకూ అనేక అంశాలు చర్చనీయాంశాలవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో తనదైన శైలిలో ఎటువంటి మొహమాటం లేకుండా నిజాన్ని, అబద్ధాన్ని కలిపి చెప్పే ఆర్కే రాయకపోవడం చాలామందిని నిరాశపరిచింది.
ఇక ప్రశ్న ఒకటే – రాధాకృష్ణ కావాలనే గ్యాప్ తీసుకున్నారా? లేక వేరే కారణాలతో గ్యాప్ వచ్చిందా? స్పష్టత లేకపోయినా, ఆయన విశ్లేషణ కోసం ఎదురుచూసే పాఠకులు మాత్రం ఆర్కే మౌనం ఎక్కువ కాలం కొనసాగకూడదని భావిస్తున్నారు.