Top Stories

దువ్వాడతో అది చేస్తే తప్పేనా?: మాధురి

తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది దివ్వెల మాధురి వ్యాఖ్యలు. డాన్సర్‌గా, యాంకర్‌గా, తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న మాధురి ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మాజీ మంత్రి రోజా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణిగా ఉన్న మాధురి గత కొద్ది రోజులుగా రాజకీయ వ్యాఖ్యలతో చర్చకు వచ్చారు.

తాజాగా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, పార్టీ నెపధ్యంలో తన భర్తపై జరిగిన అన్యాయంపై ఘాటుగా స్పందించారు. “మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తే తప్పా? అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి రోజా డాన్స్ చేస్తే మాత్రం గొప్పా?” అంటూ మండిపడ్డారు. టీవీ షోల్లో రోజా డాన్స్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. “అది సమంజసమైతే మాది తప్పేలా?” అని ప్రశ్నించారు.

వైసీపీ నాయకత్వం తమను రీల్స్ పేరిట సస్పెండ్ చేయడం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. “ఈ లాజిక్ ప్రకారం పార్టీలో చాలామందిని సస్పెండ్ చేయాలి” అన్నారు. “దువ్వాడ శ్రీనివాస్ పార్టీ కోసం చాలా చేశాడు.. ఇప్పుడది ఎక్కడ ఉంది?” అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. వైసీపీని ‘గాలి పార్టీ’గా, ‘ఇప్పటికే మింగిపోయిన పార్టీ’గా అభివర్ణించారు.

ఇక మాధురి, దువ్వాడ జంట కలిసి పలు వేదికలపై చేసిన డ్యాన్స్ వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో దువ్వాడపై సస్పెన్షన్ విధించారని వార్తలు రావడం మరింత హీట్ పెంచాయి.

మాధురి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కొందరు మాధురిని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి మాధురి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories