చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ, స్పష్టత, వేగం అని టీడీపీ వాళ్లు అనుకుంటారు. కానీ అంతకుమించిన చాదస్తం వచ్చేసింది. బహుషా వృద్ధాప్యం పెరుగుతున్న దృష్ట్యా బాబులో ఈ అసహనం ఎక్కువైనట్టుగా కనిపిస్తోందని వైసీపీ శ్రేణులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పని అయినా ఆయనకు నచ్చినట్టే పద్ధతి ప్రకారం జరగాలనుకుంటారు. అభివృద్ధి నిరంతరం సాగాలని, అధికారులు విషయానికి మాత్రమే పరిమితమై మాట్లాడాలని ఆయన ఆశిస్తారు. అవసరం లేని ఉపన్యాసాలు, ఓవర్‌స్మార్ట్‌నెస్‌ను ఆయన అస్సలు సహించరు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇదే స్పష్టమైంది. ఎగ్జిబిషన్‌ను అధికారులు ఉపన్యాసంలా వివరించగా, “నేను అడిగింది చెప్పండి చాలు… ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి” అంటూ చంద్రబాబు వెంటనే స్పందించారు. ఇది కోపం కంటే కూడా సమయ విలువ, ప్రజల అవసరాల పట్ల ఉన్న కట్టుబాటే అని చెప్పాలి.
ఈ ఘటనను వైసీపీ అనుకూల సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. కానీ వాస్తవం ఏమిటంటే చంద్రబాబు ఆగ్రహం ఫస్ట్రేషన్ ఈ మధ్య బాగా పెరిగిపోతోందని పలువురు విమర్శలు చేస్తున్నారు.


