వైసీపీలో ఎమ్మెల్సీగా సుబ్బరంగా ఉండాల్సిన దువ్వాడ శ్రీను ఎప్పుడైతే భార్యను వదిలేసి ‘దివ్వెల మాధురి’ వెంటపడ్డాడో అప్పటి నుంచి ఆయన డౌన్ ఫాల్ స్ట్రాట్ అయిపోయింది. అప్పటి నుంచి జీవితం మొత్తం అథోగతి అయిపోయింది.
ఇక వీరిద్దరి అక్రమ సంబంధాన్ని హైలెట్ చేస్తూ పలు యూట్యూబ్ చానెల్స్,మీడియా వీరిని ఇంటర్వ్యూలకు పిలిచి రచ్చ రచ్చ రంబోలా చేసి వదిలిపెడుతున్నాయి. అయినా సిగ్గు లేకుండా వీళ్లిద్దరూ పబ్లిక్ గా రోమాన్స్ చేసుకుంటుండడం చూసి ‘చీ దీనెమ్మా జీవితం.. మాకెందుకు ఈ కర్మ’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.. కొందరైతే ట్రోల్ చేస్తున్నారు.
దువ్వాడ, దివ్వెల లవ్ స్టోరీ ప్రస్తుతం సహజీవనంలా సాగుతోంది. ఇద్దరికీ విడాకులు మంజూరు కావడంతో తమ భాగస్వాములను వదిలేసి కలిసి ఉంటున్నారు. దీంతో ఎక్కడ చూసినా వీరే కనిపిస్తున్నారు.
తాజాగా ఓ షోలో దివ్వెల మాధురి ‘చంద్రముఖిలా’ మారి ‘రారా.. సరసకు రారా’ అంటూ పాట పాడగ.. తై తక అంటూ చేతులు చప్పట్లు కొడుతూ హీరోలా దువ్వాడ ఎంకరేజ్ చేశారు. చివరకు పాట అయిపోయాక హగ్గుతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇప్పుడీ రోమాంటిక్ వీడియో తెగ వైరల్ అవుతోంది.