Top Stories

వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్న మాజీ మంత్రి  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ రాజకీయ రంగప్రవేశం చేశారు. కొంతకాలంగా రాజకీయాలలో కనిపించని ఆయన, ఇటీవల అధినేత జగన్‌మోహన్ రెడ్డిని కలవడంతో చర్చలకు దారితీశారు. ఈ సమావేశం తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కూటమి ప్రభుత్వం సహా నెల్లూరు నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో పార్టీ కార్యకలాపాల్లో తన యాక్టివిటీని స్పష్టంచేశారు.

ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 30 మందితో కూడిన ఈ కమిటీని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల మధ్యనే ఆయన జోరుగా తిరిగి పార్టీకి సపోర్ట్ చేస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

నెల్లూరు సిటీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్, జగన్ క్యాబినెట్‌లో మూడు సంవత్సరాలు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోవడం తెలిసిందే. జగన్ పార్టీ ఆవిర్భావం తర్వాత వైసీపీలో చేరి జగన్‌కు అత్యంత సమీపంగా కొనసాగారు. 2024లో నరసరావుపేట నుంచి ఎంపీ టికెట్ ఇచ్చిన పార్టీ, ఆయనపై వ్యతిరేకత కారణంగా అది ఓటమి చెందడం గమనార్హం. ఆ పరాజయం తర్వాత ఆయన రాజకీయంగా కాస్త వెనకబడినట్టే కనిపించారు.

ఇక, అనిల్ కుమార్ యాదవ్ తిరిగి రాజకీయ వేదికపైకి రావడం వెనుక మరికొన్ని కారణాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా, పార్టీకి విధేయత చూపుతున్న తనలాంటి నాయకులను పక్కకు నెట్టడం వలన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలు టీడీపీలో చేరిపోయారు. వేంరెడ్డి తీరు వల్ల నెల్లూరు జిల్లాలో మైనింగ్ నిలిచిపోయి, దాదాపు పదివేల మంది పనిని కోల్పోయారని అనిల్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ప్రాణాల మీద రాజకీయాలు ఆడవద్దని వేంరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ కు నియోజకవర్గం అంటూ ఏదీ లేదు. నరసరావుపేట పరాజయం తర్వాత ఆ ప్రాంతంపై దృష్టి పెట్టలేదు. నెల్లూరు సిటీ బాధ్యతలు ఇప్పటికే వేరొకరికి అప్పగించబడ్డాయి. అంతేకాదు, అనిల్ అనుచరులు, బంధువులు కూడా టీడీపీలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలకు మొగ్గుచూపిన ఆయన, ఇప్పుడు తిరిగి వైసీపీలో యాక్టివ్ అవుతుండటం రాజకీయ చర్చలకు కారణమవుతోంది. అనిల్‌లో ఉన్న అభద్రతా భావం ఈ తిరిగివచ్చే ప్రయత్నాల వెనుక కారణమా? అనే ప్రశ్నలూ వెల్లువెత్తుతున్నాయి.

ఏదేమైనా, అనిల్ కుమార్ యాదవ్ తిరిగి వైసీపీ వేదికపై కనిపించడం రాబోయే రాజకీయ పరిణామాలకు ఆసక్తికరంగా మారనుంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories