Top Stories

గడ్డి పీకుతున్నావా పీకే.. పవన్ కళ్యాణ్ కు ఇచ్చిపడేసిన జడా శ్రవణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జై భీమ్ రావు పార్టీ అధినేత జడ శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో మహిళల మిస్సింగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయిన ఆడపిల్లల గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో గడిచిన కొద్ది రోజుల నుంచి 25 మంది మహిళలు కనిపించడం లేదంటూ ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, వీటిపైన పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ గతంలో వ్యక్తం చేసిన ఉద్దేశం ప్రకారం వీరందరినీ ఏ విదేశాలకు తీసుకువెళ్లి అమ్మేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి గతంలో చెప్పిన దాని ప్రకారం చూస్తే వీరంతా వ్యభిచార వృత్తిలోకి వెళుతున్నట్టుగానే భావించాలా.? అని జడ శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళలు కనిపించకుండా పోయిన ఆయనకు పట్టడం లేదని, పవన్ కళ్యాణ్ కుప్పం నియోజకవర్గానికి కూడా డిప్యూటీ సీఎం కాబట్టి దీనిపై దృష్టి సారించాలని ఆయన కోరారు. కుప్పం నియోజకవర్గంలో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని, దీనిపై సీఎం స్పందిస్తున్నారో లేదో తెలియడం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మిస్ అయిన ఆడ పిల్లలు బతికున్నారో.. లేదో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కనిపించకుండా పోయిన ఆడపిల్లల జీవితాలు గురించి తన ఆందోళన అంతా అని, సదరు మహిళల గురించి డిప్యూటీ సీఎం ఒక్క ఫోన్ కాల్ చేయాలని సూచించారు.

కుప్పం నియోజకవర్గంలోని పోలీసులకు డిప్యూటీ సీఎం ఫోన్ చేస్తే హెలికాప్టర్ లో వెళ్లి అమ్మాయిలను తీసుకువస్తారంటూ వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను తాను ఒకటే కోరుతున్నానని, కనిపించకుండా పోయిన అమ్మాయిలు గురించి పట్టించుకోవాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ లో బిజీగా ఉన్నారని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పట్టించుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే మిలిటరీ హెలికాప్టర్లు మొత్తం దిగుతాయని, కనిపించకుండా పోయిన అమ్మాయిలు అందరిని తీసుకువస్తారంటూ వ్యాఖ్యానించారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం లో జరుగుతున్న ఈ వ్యవహారాలపైన దృష్టి సారించాలని ఆయన అంటూ పవన్ కళ్యాణ్ కు ఆయన సూచించారు. ‘నాయన సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తున్నా విను ఇవన్నీ ఎఫ్ఐఆర్లు సిగ్గుండాలి. మీ ముఖ్యమంత్రి కార్యాలయానికి.. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నవాళ్ళకి’ అంటూ జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జడ శ్రవణ్ మాట్లాడిన మాటలు, గతంలో అమ్మాయిల మిస్సింగ్ కేసులకు సంబంధించి పవన్ కళ్యాణ్ వైసీపీపై చేసిన ఆరోపణల వీడియోను మిక్స్ చేసి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పలువురు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

Trending today

దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో...

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

    కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా...

అఘోరి-శ్రీవర్షిణి పెళ్లి.. షాకింగ్ వీడియోలు

  మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో అఘోరీ మరియు శ్రీ వర్షిణి అనే...

గేదెలకు కుడితి కలుపుతున్న చంద్రబాబు.. వైరల్ వీడియో

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు...

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్...

Topics

దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో...

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

    కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా...

అఘోరి-శ్రీవర్షిణి పెళ్లి.. షాకింగ్ వీడియోలు

  మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో అఘోరీ మరియు శ్రీ వర్షిణి అనే...

గేదెలకు కుడితి కలుపుతున్న చంద్రబాబు.. వైరల్ వీడియో

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు...

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్...

కిరణ్ పాపం పండింది.. ఇదీ వైసీపీ విజయం

గుంటూరు పోలీసులు వైయస్ భారతి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో...

ఈ నీచుడిని అరెస్ట్ చేసి లోపలేయండి

  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారంలో ఉన్న కూటమి...

వైసీపీ వ్యతిరేకులు గుర్తుపెట్టుకోండి!

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరుస్తూ...

Related Articles

Popular Categories