ఇటీవలే తన తల్లి అల్లు కనకరత్నమ్మను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న అల్లు కుటుంబానికి మరో షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ఉన్న అల్లు బిజినెస్ పార్క్‌పై GHMC అక్రమ నిర్మాణం ఆరోపిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతి ప్రకారం ఆ భవనం కేవలం మూడు అంతస్తుల వరకు మాత్రమే నిర్మించాల్సి ఉండగా, అదనంగా పెంట్‌హౌస్‌ను కట్టినట్లు గుర్తించారు. దీనిపై GHMC వెంటనే చర్యలు తీసుకుంటూ నోటీసులు పంపింది.
ఇప్పటికీ అల్లు అరవింద్ స్పందించకపోయినా, ఆ పెంట్‌హౌస్‌ను కూల్చివేయాలా, లేక GHMC నుంచి అనుమతి తీసుకునే ప్రయత్నం చేయాలా, లేక న్యాయపరమైన మార్గం ఎంచుకోవాలా అన్నది చూడాలి.
కుటుంబం మొత్తం తీవ్ర బాధలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి సమస్య రావడం అల్లు ఫ్యామిలీకి మరింత కఠినంగా మారింది. అయితే ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఉన్న అల్లు అరవింద్ ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.