‘విజనరీ’ పరువు పాయే..  ఏం ‘బాబు’.. ఏంటా ప్రశ్న? వైరల్ వీడియో

ఫొటోలకు ఫోజులివ్వడం.. బాగా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించిన టైకూన్ లేరని అంటారు. పని తక్కువ ప్రచారం ఎక్కువగా చేస్తారు. ఎల్లో మీడియాతో నెట్టుకొస్తున్నాడు కానీ చంద్రబాబు వేశాలకు ఎప్పుడో దెబ్బైపోయేవారు. కానీ మేనేజ్ మెంట్ లో కింగ్ లాంటి చంద్రబాబు అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు.

స్కూళ్లను బాగు చేయలేని చంద్రబాబు నిన్న ఏపీలో మధ్యాహ్న భోజనం తనిఖీలు అంటూ పాఠశాలల మీదపడ్డారు. జగన్ బాగు చేసిన స్కూళ్లలో సౌకర్యాలు చూసి పవన్, బాబులు ఆశ్చర్యపోయారు. ఎలాగూ అంత చేయలేరు కాబట్టి అక్కడ కింద కూర్చొని పాఠశాల విద్యార్థులతో కలిసి నేల మీద భోజనం చేసి తాము సామాన్యులమని బాబు గారు ఫోకస్ చేశారు.

అయితే మీడియా కవర్ చేస్తుండగా కనీసం పిల్లలు హోం వర్క్ ఎక్కడ చేస్తారో కూడా తెలియని బాబు గారు నవ్వుల పాలయ్యారు. ‘స్కూలు కు వచ్చినాక హోం వర్క్ ఎన్ని గంటలు చేస్తావు’ అంటూ పక్కనే తింటున్న బాలికను ప్రశ్నించాడు. దానికి ఆ బాలిక ఆశ్చర్యపోయింది. ఎవరైనా స్కూలు కు వచ్చాక హోం వర్క్ చేస్తారా? స్కూలునుంచి ఇంటికెళ్లాక చేస్తారు కదా అని బాలిక సమాధానం చెప్పలేకపోయింది.

ఈ వీడియో షేర్ చేస్తూ విజనరీ చంద్రబాబుకు కనీసం హోం వర్క్ ఎక్కడ ఎప్పుడు చేస్తారో కూడా తెలియదని షేర్లు చేస్తూ నవ్వుకుంటున్నారు.

వీడియో కోసం దీనిమీద క్లిక్ చేయండి