కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు వచ్చిన సందర్భంలో, ఆయన అభిమానులు చూపిన ఉత్సాహం, ప్రేమ అందరినీ ఆశ్చర్యపరిచింది.
జగన్ వస్తున్నారని తెలిసిన క్షణం నుంచి గ్రామం అంతా ఉత్సాహంతో నిండిపోయింది. పోలీసులు విధించిన ఆంక్షలు, ఏర్పాటు చేసిన బారికేడ్లు, అడ్డుగోడలు ఏవీ అభిమానుల ఉత్సాహాన్ని తగ్గించలేకపోయాయి.
“జగన్ అన్న వస్తున్నారు” అనే ఒక్క మాటే చాలు — వర్షం, ఎండ, అడ్డంకులు అన్నీ మరచి అభిమానులు ముందుకు దూసుకెళ్లారు.
ఒక వీడియోలో అభిమానులు “గోచీ ఊడిపోయినా సరే, జగన్‌ను చూడాలి!” అంటూ కేకలు వేస్తూ బారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ ఉత్సాహం చూసి అక్కడున్న పోలీసులు కూడా ఆశ్చర్యపోయారని చెబుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
జగన్ పట్ల అభిమానులు చూపుతున్న ఈ ప్రేమ, ఆరాధన ఆయనకు ప్రజల్లో ఉన్న స్థాయిని మరొకసారి రుజువు చేసింది. ఏ అడ్డంకులున్నా, ఎంత కఠిన పరిస్థితులైనా జగన్ కోసం ప్రాణాలు పణంగా పెట్టే అభిమానులు ఉండటం, వైసీపీ కేడర్‌కి గర్వకారణం అవుతోంది.
జగన్ పట్ల ప్రజలలో ఉన్న ఈ నిబద్ధత, భక్తి భావం మరింత బలపడుతుందనే సంకేతాలను ఈ ఘటన ఇస్తోంది. ఎవరూ అడ్డుకోలేని ప్రేమ.. ఎవరూ ఆపలేని ఆరాధన.. అదే జగన్ అభిమానుల శక్తి!

