Top Stories

ఇదేనా మంచి ప్రభుత్వం 

గోదావరి గడ్డ మీద నుంచి ఓ యువకుడు గొంతెత్తిండు. వాడు అడిగినయన్నీ సూటి ప్రశ్నలు. కూటమి సర్కారు గుండెల మీద గునపాల్లా దిగినయ్. పాయసం లాంటి గోదావరి యాసలో వాడు సంధించిన సెటైర్లు ఇప్పుడు రాష్ట్రమంతా మార్మోగుతున్నయ్.

“గడిసిన ఏడాదిలో ఏపీల ఆడబిడ్డలు, పసిగుడ్డలు విచక్షణారహితంగా మానభంగాలకు గురైన్రు. ఈ పాపాత్ముల్లో తెలుగుదేశం నాయకులూ ఉన్నరు. ఇదేనా మంచి సర్కారు? ఇదీ మంచి సర్కారు అంటే దెయ్యాలు కూడ సిగ్గుపడతయ్ కదూ!” అంటూ మొదలుపెట్టిండు. వాడి మాటల్లో ఆవేదన, ఆగ్రహం స్పష్టంగా కనిపించినయ్.

అక్కడితో ఆగలేదా యువకుడు. అన్నదాతల కష్టాల మీద సెటైర్లు పేల్చిండు. “రైతుల కడుపు కొట్టినంక మంచి సర్కారు అనిపించుకోవాలని చూస్తరా? వడ్లు కొనుక్కుని పైసలు అంటగట్టక రైతులెక్క కలెక్టర్ల కాడ దీనంగా అడుక్కుంటున్నరు. దీనికి మంచి సర్కారు అనాల్నా? ఈ సర్కారుకు మంచి అన్న పదం వాడితే పాపం తగులుతది!” అని అన్నడు. పండించినోడికి గిట్టుబాటు ధర రాక, పైసలు అందక పడుతున్న పాట్లను సూటిగా ప్రశ్నించిండు.

రోడ్ల గురించి ఇచ్చిన హామీలను కూడా వదలలేదా యువకుడు. “సంక్రాంతికల్లా రోడ్లను అద్దాల్ల మెరిపిస్తం అన్నరు కదా? సంక్రాంతి పోయి సగం సంవచ్చరం కూడ అయిపోయింది. ఇంకా రోడ్ల మీద గుంతలే. పడుకునే గుంతలు కూడ రోడ్ల మీద లేవు. ఇసుక పోసినంక దాని మీద మళ్ళా గుంతలు పడ్డయి. దీనికి మీది మంచి సర్కారు అనాల్నా? మాట తప్పినోళ్లు కూడ మంచి సర్కారు అనిపించుకోవాలని చూస్తరా?” అని సెటైర్ వేసిండు.

విద్యా, వైద్యంపై కూడ నిప్పులు చెరిగినడు. “విద్యా, వైద్యం దండగంట, మెడికల్ కాలేజీని పక్కనపెట్టి మద్యాంధ్య ప్రదేశ్ గా ఏపీని తీర్చిదిద్దుతున్నరు. లిక్కర్ అంటె విచ్చలవిడిగా అమ్ముతున్నరు. దీనికి మీది మంచి సర్కారు అనాల్నా? ఇగ మీ సర్కారుకు దండం పెట్టాలనిపిస్తుంది.” అని ఆక్రోషించిండు. విద్య, వైద్యం లాంటి కీలక రంగాలను నిర్లక్ష్యం చేసి మద్యం అమ్మకాలపై పెట్టిన శ్రద్ధను ఎండగట్టిండు.

చివరగా, పీఆర్ టీమ్‌ల పేరిట జరుగుతున్న “షో”లను దుయ్యబట్టిండు. “నెలకో సామాన్యుని ఇంటికి పోయి పీఆర్ టీంలతోటి షో చేస్తున్నరు. దీనికి మీది మంచి సర్కారు అనాల్నా? జనం కష్టాలు తీర్చకుండా ఇట్ల షోలు చేస్తే జనం నవ్వుతరు గానీ పొగుడరు.” అని నిలదీసిండు.

ఈ యువకుడి మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినయ్. గోదావరి యాసలో వాడు సంధించిన ఈ సెటైర్లు కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేవిగా ఉన్నయ్ అనడంలో సందేహం లేదు.

https://www.facebook.com/watch/?v=1242433740693841&rdid=ni2aCkvLykp2BQhz

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories