బంగారం, వెండి ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈ వారం రెండోసారి గోల్డ్ ధర లక్షా 40 వేల మార్క్‌ను దాటింది. ధరలు రోజురోజుకూ వేల రూపాయల చొప్పున పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,020కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,28,350గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,54,000కు చేరింది. పండుగ సీజన్‌లో ధరల పెరుగుదల సామాన్యులపై భారంగా మారుతోంది.


