గూగుల్ డేటా సెంటర్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అమెరికాలో ఇప్పటికే కొన్ని డేటా సెంటర్లు పర్యావరణ ప్రభావం, అధిక విద్యుత్ వినియోగం, నీటి వనరుల దోపిడీ కారణంగా మూసివేయబడ్డాయి. అదే సమస్య ఇప్పుడు భారతదేశంలో కూడా వినిపిస్తోంది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను చూసి పచ్చ మీడియాలో గందరగోళం నెలకొంది.
ఈ వివాదంపై ఏబీఎన్ చానెల్‌లో యాంకర్ వెంకటకృష్ణ బిగుసుకుపోయిన పరిస్థితి కనిపించింది. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండగా, ఆ వ్యతిరేక భావనను డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి చానెల్‌లో వరుస చర్చలు, ప్రత్యేక డిబేట్లు, కవర్ డ్రైవ్‌లు మొదలుపెట్టారు. కానీ పరిస్థితి ఊహించిన దానికంటే క్లిష్టంగా మారింది.
గూగుల్ డేటా సెంటర్లకు అవసరమైన అధిక విద్యుత్, నీటి వనరులు స్థానిక ప్రజలకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు విస్తృతమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలోనే పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి ఏబీఎన్ వంటి యెల్లో మీడియా చానెల్లు రక్షణాత్మక వైఖరి అవలంబిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు” అన్నట్టుగా వెంకటకృష్ణ సమీక్షలు, స్పెషల్ షోలు చూస్తేనే ఆ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అడుగుతున్నారు.. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎవరికీ లాభం? స్థానిక ప్రజలకు, పర్యావరణానికి ముప్పు ఎంత? మీడియా ఎందుకు ఈ ఇష్యూను సమతుల్యంగా చూపించడం లేదు?
ఇకపోతే, డిజిటల్ ఇండియా పేరిట జరుగుతున్న ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే పనిచేస్తున్నాయా? అన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది.
మొత్తానికి, ఉలిక్కిపడ్డ యెల్లో మీడియా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి ఎన్ని కసరత్తులు చేసినా ప్రజల అవగాహన ముందు సత్యం దాచలేకపోతుంది.