Top Stories

మళ్లీ సనాతన దీక్ష చేసే టైం వచ్చింది ‘పవనన్నా’.. ఇదీ చూడు!

తిరుమలలో ఏదో జరిగిందని.. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఇప్పటికీ కూడా దాని మీద ఆధారాలు సేకరించలేదు. ఎవరినీ అరెస్ట్ చేసిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ మైలేజ్ కోసం ఇలా ఆరోపించినట్టుగా అర్థమవుతోంది.

తిరుమలలో వేంకటేశ్వరుడి ప్రసాదానికి ఇలా అయితే గొంతు చించుకొన్న పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు ఏకంగా విశాఖలో అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని అందరిముందే సుత్తెలతో పగులకొట్టి మరీ పక్కనపెట్టేశారు.

2025 జనవరి 24న విశాఖలో ఘోరమైన అపచారం జరిగింది. విశాఖపట్నంలోని సీతమ్మధార రెవిన్యూ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని జీవీఎంసీ అధికారుల కూలగొట్టడం కలకలం రేపింది.

ఇది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇతర మతాల వారిపై కనీసం ప్రహరీ గోడ కూడా కూలగొట్టడానికి వెళ్లని మున్సిపల్ అధికారులు.. హిందూ దేవుళ్ల విషయంలో ఇంతటి ఘోరమైన అపచారానికి పూనుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు.

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించి తిరుమలలో లాగానే మెట్లు కడిగి సనాతన దీక్ష చేపట్టి పాప పరిహారం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తన ప్రభుత్వంలో జరిగిన ఈ ఘోరానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాడోనని నిలదీస్తున్నారు. మరి ఇది విశాఖలోనే జరిగిందా? నెటిజన్లు కావాలనే వీడియో రిలీజ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories