నిన్న ఏబీఎన్ ఛానెల్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమిపై విరుచుకుపడ్డారు. తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎల్లో మీడియా బట్టలిప్పేశాడు. ప్రజల ముందు పెట్టేశాడు. జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై జర్నలిస్ట్ వెంకటకృష్ణ తన ఏబీఎన్ చానెల్ లో చర్చకు పెట్టి కొంతమంది ఉప్మా నేతలను తీసుకొచ్చి తీవ్రంగా స్పందించారు. జగన్ ఉపయోగించిన “సాడిజం”, “శాడిస్ట్” వంటి పదాలపై వెంకటకృష్ణ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, ఎద్దేవా చేశారు.
ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ప్రముఖ నాయకుడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. వెంకటకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ “ఏయ్ వెంట్రుకా – సులభ్ కాంప్లెక్స్ ముందు బ్లాక్ టికెట్స్ అమ్ముకునే నువ్వా ఇంగ్లీష్ గురించి మాట్లాడేది.. జగన్ లాంగ్వేజ్ మీద మాట్లాడే అర్హత లేదు సిగ్గుండాలి వెంకటకృష్ణ” అంటూ తీవ్ర పదజాలంతో ఎద్దేవా చేశారు.
ఈ ఘటన రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు జర్నలిస్ట్ తన విశ్లేషణను వ్యక్తపరచగా, మరోవైపు అధికార పార్టీ నాయకుడు దానికి ఘాటైన రీతిలో స్పందించడం చూస్తుంటే, రాష్ట్రంలో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. ఈ మాటల యుద్ధం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.