Top Stories

‘హరి హర వీరమల్లు’ చిత్రం లీక్

 

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లోనే అత్యధిక డేట్స్ కేటాయించారు. ఆయనకు ఉన్న రాజకీయపరమైన బాధ్యతలు ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం సమయం ఇవ్వడం సులభం కాదు. అయినా కూడా, ఆయన డేట్స్ ఇచ్చారు. ఒకవైపు తన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే, మరోవైపు తాను ప్రేమించే పవన్ కళ్యాణ్‌కు, ఆయన అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే స్థాయి సినిమా ఇవ్వాలని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత AM రత్నం.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీని నిర్మాత AM రత్నం కొంతమంది ప్రముఖులతో కలిసి ప్రసాద్ ల్యాబ్స్‌లో చూశారని సమాచారం. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత ఆయన ఆనందం అంతా ఇంతా కాదట. తాను ఊహించిన దానికంటే అద్భుతమైన అవుట్‌పుట్ వచ్చిందని, ఇలాంటి సినిమాను తీసినందుకు గర్వంగా ఉందని ఆయన మీడియా మిత్రులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. అయితే, ఏ నిర్మాత అయినా తన సినిమా తనకు బాగుందని చెప్పుకుంటాడు, కానీ ప్రేక్షకులకు నచ్చడమే ముఖ్యం.

అయితే, ఈ సినిమాను ప్రేక్షకుల్లా చూసిన కొంతమంది ప్రముఖులు, బయ్యర్ల నుండి వచ్చిన టాక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. నెల్లూరు, గుంటూరు ప్రాంతాల థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసిన డాక్టర్ పవన్ ఈ చిత్రాన్ని చూశారట. కొద్దిసేపటి క్రితమే ఆయన ట్విట్టర్‌లో ఈ సినిమాకు సంబంధించిన రివ్యూను అప్‌లోడ్ చేశారు. ఆయన నుండి వచ్చిన ఒకే ఒక్క మాట – “పవన్ కళ్యాణ్ అభిమానులారా మీ టైం మొదలైంది. ఇక రెచ్చిపోండి!” అని.

సినిమా విజువల్‌గా ఒక అద్భుతంగా ఉందని, ఇప్పటివరకు మీరు చూసిన పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో కనిపించబోయే పవన్ కళ్యాణ్ మరో ఎత్తు అని ఆయన అన్నారు. “రాసుకోరా సాంబ, థియేటర్స్ బ్లాస్ట్ అవ్వకపోతే నన్ను అడుగు!” అంటూ పేర్కొన్నారు. సినిమాలోని హైలైట్స్‌ గురించి ఆయన మాట్లాడుతూ…

గుడి వద్ద కొన్ని సన్నివేశాలు

పోర్ట్‌లో వచ్చే ఫైట్ సన్నివేశం

కుస్తీ ఫైట్‌లో వచ్చే ఎమోషన్స్

‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్

అద్భుతమైన ఇంటర్వెల్ సన్నివేశం

ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం

పులితో వచ్చే సన్నివేశం

మైండ్‌ను బ్లాస్ట్ చేసే ప్రీ-క్లైమాక్స్ సన్నివేశం

‘తారా’ సాంగ్

చిన్న పాపతో వచ్చే ఎమోషనల్ సన్నివేశం

బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్

…ఇవన్నీ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌కు ఫ్యాన్స్ ఏమైపోతారో అని, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌ను ఎవరూ కలలో కూడా ఊహించని అవతార్‌లో కనిపించబోతున్నాడని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ నిజమా కాదా అనేది తెలియాలంటే మరో 5 రోజులు ఆగాల్సిందే.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories