తెలుగు సినిమా ఇండస్ట్రీ – రాజకీయాల మధ్య సంబంధం ఎప్పటినుంచో చర్చలకూ, విమర్శలకూ కారణమవుతూనే ఉంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు టాలీవుడ్ పెద్దలు వెళ్లిన దృశ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
మొదటి ఫోటో బయటకొచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ సహా పలువురు ఎంత రచ్చ చేశారో అందరికీ తెలుసు. “గౌరవం ఇవ్వలేదని, మర్యాద చేయలేదని” పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అదే ఫోటో మరో రూపంలో బయటపడినప్పుడు మాత్రం ఒక్క మాటా పలకకుండా మూగబోయారు.
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినీ ప్రముఖులు, నిర్మాతలు చేతులు జోడించి, బంట్రోతుల్లా రేవంత్ రెడ్డి ఎదుట కూర్చోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. “ముందు సీట్లో కూర్చోబెట్టారు.. గౌరవం ఇచ్చారు” అనే వాదన ఇప్పుడు ఎక్కడికో మాయం అయింది.
పవన్ కళ్యాణ్ తరచూ “నా అన్నకు గౌరవం ఇవ్వలేదు, జగన్ మర్యాద చూపలేదు” అని వాదించారు. అయితే రేవంత్ రెడ్డి ఎదుట ఇండస్ట్రీ ప్రముఖులు అలా కూర్చున్నప్పుడు, పవన్ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు?
ఆ సందర్భంలో ఆయనకు మాట రావడంలేదా? లేక “రాజకీయ ప్రయోజనం” అనుగుణంగా మూగబోయారా?
ఇక చిరంజీవి గారు కూడా రేవంత్ రెడ్డి మీటింగ్‌కి వెళ్లి ఉండి ఉంటే, పరిస్థితి ఎంత వేరుగా ఉండేదో అనుకోవాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగానే ఏం మాట్లాడేవారో అనే సందేహం తలెత్తుతోంది.
ప్రతిసారి ఒకే అంశాన్ని ఎంచుకొని “గౌరవం–మర్యాద” అనే జెండా ఊపే పవన్ కళ్యాణ్, ఇప్పుడు మాత్రం గమ్మత్తుగా సైలెంట్‌గా కూర్చున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించడం మొదలుపెట్టారు. ప్రశ్న ఏమిటంటే – పవన్ కళ్యాణ్‌కు నిజంగా “ఇండస్ట్రీ గౌరవం” ముఖ్యమా? లేక రాజకీయ లాభాలే ప్రాధాన్యమా?