ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హైకోర్టు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. ఆయనపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం మంత్రిగా ఉండి ప్రభుత్వ నిధులు వాడుకున్నారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ కేసులో సిబిఐ, ఏసీబీ న్యాయవాదులను ప్రతివాదులుగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. అయితే ముందుగానే నోటీసులు ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. పవన్ కళ్యాణ్ తన స్వంత సినిమాకే టికెట్ ధరల పెంపు కోసం ఫైళ్లను ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ పిటిషన్ విచారణ మరో వారం రోజులు వాయిదా పడింది. తాత్కాలికంగా కొట్టివేస్తారని భావించిన కేసును హైకోర్టు స్వీకరించడం పవన్ కళ్యాణ్‌కు పెద్ద షాక్‌గా మారింది.