Top Stories

నేను చనిపోతున్నాను: ఆంధ్రజ్యోతి రిపోర్టర్

కామారెడ్డి జిల్లా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఆత్మహత్య రేపు చేసుకుంటానంటూ విడుదల చేసిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తాను రేపు చనిపోతున్నానని, దీనికి కారణం ఆంధ్రజ్యోతి కామారెడ్డి జిల్లా స్టాఫర్ ప్రశాంత్, నిజామాబాద్ బ్యూరో ఇంచార్జి సంపత్ అని ఆయన ఆరోపించారు.

ఆత్మహత్యాయత్నం చేసిన ఈ రిపోర్టర్ గత 17 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతిలో పనిచేశానని వీడియోలో పేర్కొన్నారు. “కామారెడ్డి జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫర్ ప్రశాంత్, నిజామాబాద్ బ్యూరో ఇంచార్జి సంపత్ నన్ను డబ్బుల కోసం చాలా ఇబ్బంది పెడుతున్నారు. నెల రోజుల నుండి నన్ను హింసిస్తున్నారు. నేను ఇంకా బ్రతకను” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పలువురు జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం, ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్లపై సర్క్యులేషన్స్, యాడ్స్ కోసం తీవ్ర ఒత్తిడి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఒత్తిడి కారణంగానే రిపోర్టర్లు డబ్బులు వసూలు చేయాల్సి వస్తుందని, ఈ క్రమంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “డబ్బుల కోసం పీల్చిపిప్పి చేసి రిపోర్టర్ చావుకు కారణమయ్యారా?” అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం, పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. జర్నలిస్టుల జీవితాల్లో నెలకొన్న ఇలాంటి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/TeluguScribe/status/1939519123710517457

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories