పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన కంటెంట్, ముఖ్యంగా ‘ఫైర్ స్ట్రోమ్’ పాట, ప్రేక్షకుల్లో హైప్‌ను రెట్టింపు చేశాయి. రేపు మరో మెలోడీ ట్రాక్ ‘సువ్వి సువ్వి’ విడుదల కాబోతోంది.
అయితే, ఈ సినిమాపై పెరిగిన క్రేజ్‌కు కారణమైన ప్రధాన అంశం — పవన్ కుమారుడు అకిరా నందన్ కీలక పాత్రలో కనిపిస్తాడని వచ్చిన రూమర్స్. క్లైమాక్స్‌లో గెస్ట్ రోల్, సీక్వెల్‌లో హీరోగా ఉంటాడని వచ్చిన వార్తలు ఫ్యాన్స్‌లో భారీ క్యూరియాసిటీ కలిగించాయి. కానీ మూవీ యూనిట్ వర్గాలు మాత్రం ఇవన్నీ ఫేక్ న్యూస్ అని చెబుతున్నాయి.
సినిమాలో అకిరా లేకపోవడం ఫ్యాన్స్‌లో నిరుత్సాహాన్ని కలిగించి, నెగటివ్ టాక్ వచ్చే అవకాశముందనే ఆందోళన ఉంది. దీనికి చెక్ పెట్టేందుకు సెప్టెంబర్ 2న పవన్ బర్త్‌డే సందర్భంగా ‘ది వరల్డ్ ఆఫ్ ఓజీ’ గ్లింప్స్ రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేసింది. ఇదే ఆడియన్స్ అంచనాలను సెట్ చేసే కీలక ప్రమోషన్ అవుతుందని భావిస్తున్నారు.
ఇక ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానున్నాయి.