జలపల్లి మంచు ఫ్యామిలీ ఫాంహౌస్ లో పెద్ద ఎత్తున కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. మోహన్ బాబుకు, మంచు మనోజ్ కు పెద్ద యుద్ధమే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ నెట్‌వర్క్‌లలో వైరల్‌గా మారింది. మంచు ఫాంహౌస్ లో పరిధిలో జరిగిన ఫైటింగ్ వీడియో ఇది. మోహన్ బాబు తాగి గొడవ చేస్తున్న మనోజ్ ను ఆపుతుంటే.. అతడు తోటి వారిపై అరస్తున్న వీడియో ఒకటి రికార్డ్ అయ్యింది.
ఆ సమయంలో మనోజ్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. అతను మోహన్ బాబు ఫ్రెండ్ వైపు తిరిగి చూస్తూ.. “మా ఇంటి కొచ్చి… నన్నే ఆపుతావా? అంటూ పెద్దాయనను బూతులు తిడుతున్నాడు.. మోహన్ బాబు తదితరులు మనోజ్ ను ఆపుతున్నారు.
మంచు మనోజ్ తనను కొట్టారంటూ మోహన్ బాబు ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మనోజ్, అతని కోడలు మౌనిక తనను కొట్టారని గతంలో రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మనోజ్, తన భార్య ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ నెల 8న తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు గందరగోళం సృష్టించి భయభ్రాంతులకు గురిచేశారన్నారు.