Top Stories

హరిహర వీరమల్లులో హీరో పవన్ కళ్యాణ్ కాదా, డూపా?

 

ఈ మధ్యకాలంలో హీరోలు అందుబాటులో లేని సమయాల్లో ఎక్కువమంది మేకర్స్ డూప్స్‌తో షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అయితే, డూప్స్‌తో చేసినప్పటికీ కూడా వీఎఫ్‌ఎక్స్ (VFX) సహాయంతో సహజత్వానికి వంద శాతం మ్యాచ్ చేయడం వల్ల ఆడియన్స్‌కు డూప్‌ను వాడారనే సందేహం వచ్చేది కాదు. అందుకు చక్కటి ఉదాహరణ ‘కల్కి’ చిత్రం. ఈ సినిమాలో అధిక శాతం షాట్స్ డూప్స్‌తోనే కానిచ్చేశారు. అయినప్పటికీ, ఆడియన్స్‌కు ఎక్కడా కొంచెమైనా డూప్ వాడినట్టు అనిపించలేదు.

అయితే, ఈరోజు విడుదలైన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో మాత్రం అనేక ఫైట్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ డూప్‌ను వాడారని సినిమా చూస్తున్న చిన్న పిల్లలు కూడా కనిపెట్టేయగలరు. అంత దారుణంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేశారు. ఆయన అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపించింది.

పవన్ కళ్యాణ్ పాత్ర, నటన
సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను కొత్తగానే డిజైన్ చేశారు కానీ, నటన పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆ పాత్రలో అంత స్కోప్ ఇవ్వలేదు డైరెక్టర్. డైలాగ్స్ కూడా పవన్ కళ్యాణ్‌కు చాలా తక్కువే, కానీ మంచి ప్రభావం చూపేవే. అయితే, చార్మినార్ ఫైట్‌లో కానీ, సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో కానీ ప్రతీ షాట్‌లోనూ డూప్‌ను వాడినట్టుగా అనిపించింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇలా చేసి ఉంటారని అంతా అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు పర్వాలేదు అనే రేంజ్‌లో ఉన్నాయి, అవే ఈ సినిమాను కాపాడాలి. వీకెండ్ వరకు ఆడితే నిర్మాత AM రత్నం కొంతమేరకు సేఫ్ అవుతాడు. లేకపోతే దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇతర నటీనటుల విషయంలో డూప్స్ వాడకం
కేవలం పవన్ కళ్యాణ్ విషయంలోనే కాదు, ఇతర నటీనటుల విషయంలో కూడా డూప్స్‌ను భారీగా ఉపయోగించారు మేకర్స్. అందులో బాబీ డియోల్ కూడా ఉన్నాడు. చాలా సన్నివేశాల్లో ఆయనకు కూడా డూప్ వాడినట్టు స్పష్టంగా జనాలకు అర్థమైపోతుంది. “వీఎఫ్‌ఎక్స్ ఇన్నేళ్లు వీళ్లంతా ఏమి చేశారో అసలు అర్థం కావడం లేదు” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories