సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఘాటుగా స్పందించారు.
సుగాలి ప్రీతి కుటుంబానికి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు, భూములు, ఆర్థిక సాయం అందించారని గుర్తుచేసిన ఆయన “అన్నీ తిరిగి ఇవ్వగలనంటోంది ప్రీతి తల్లి. కానీ ఆమె కూతురిని తిరిగి ఇవ్వగలవా పవన్?” అంటూ నిలదీశారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన పరిహారం, సాయం చట్టపరమైన హక్కు అని శ్రవణ్ స్పష్టం చేశారు. “ప్రభుత్వం బాధిత కుటుంబానికి చేసిన సహాయం హక్కు. నీ సినిమా డబ్బులు సుగాలి ప్రీతికి ఇవ్వాల్సిన అవసరం లేదు” అంటూ పవన్ వ్యాఖ్యలను చూరగొట్టేశారు.
పవన్ కళ్యాణ్ చేసిన “ఇడియట్” వ్యాఖ్యలకు ప్రతిగా, శ్రవణ్ కుమార్ కూడా అదే భాషలో కౌంటర్ ఇచ్చారు. పవన్‌పై తన విమర్శలను ఊచకోతలా సాగించిన ఆయన “నువ్వు రాజకీయాల్లో చేసిన ప్రతి మాట బాధ్యతతో ఉండాలి. సినిమా డైలాగులు కాదు” అంటూ హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలతో సుగాలి ప్రీతి కేసు మళ్లీ రాజకీయ వాదనలకు వేదిక అవుతోంది. ఒకవైపు బాధిత కుటుంబం న్యాయం కోరుతుంటే, మరోవైపు నేతల పరస్పర విమర్శలు ఈ కేసు సున్నితత్వాన్ని మరింత పెంచుతున్నాయి.