ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ తీరులో ఇటీవల పెద్ద మార్పు కనిపిస్తోంది. గతంలో మీడియా దూరంగా ఉన్నారని విమర్శలు వచ్చిన జగన్, ఇప్పుడు పూర్తిగా వ్యూహం మార్చుకున్నారు. నెలకు ఒకటి, రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, తన మాటను ప్రజలకు నేరుగా చేరవేయాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఆయన ఇక మాటలకే పరిమితం చేయడం లేదు. ఆధారాలను మీడియా ముందుకు తీసుకువస్తూ, సంఖ్యలు–పత్రాలు చూపిస్తూ ప్రభుత్వ పనితీరును నిలదీస్తున్నారు. గతంలో ప్రచార యుద్ధంలో జరిగిన లోటుపాట్లను పూడ్చుకునేందుకు ఇది జగన్ పక్కా ప్రయత్నమని విశ్లేషకుల అభిప్రాయం.
జగన్ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు చూస్తే… వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని రీబిల్డ్ చేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. సమయానుసారం ప్రజలనుద్దేశించి మాట్లాడటం, ప్రభుత్వ పనితీరుపై కఠినమైన విమర్శలు చేయడం, ఆధారాలతో ప్రజాభిప్రాయాన్ని ఆకర్షించడం.. ఇవి అన్నీ వచ్చే రాజకీయ పోరాటానికి పునాది వేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల దృష్ట్యా, ప్రజలతో నేరమైన కమ్యూనికేషన్ పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఈ మార్పు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే… జగన్ రాజకీయ శైలిలో వచ్చిన ఈ కొత్త దిశ, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలకు వేడి తెచ్చే సూచనలు ఇస్తోంది.


