వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ముందుగానే మొదలయ్యాయి. డిసెంబర్ 21కి ఇంకా రెండు రోజులు సమయం ఉన్నా.. వైసీపీ శ్రేణులు ఇప్పటికే సంబరాలకు శ్రీకారం చుట్టారు. జగన్ ఎక్కడ కనిపించినా అభిమానులు బర్త్‌డే విషెస్‌తో హోరెత్తిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ విమానంలో ప్రయాణించేందుకు ఎక్కగానే అక్కడ ఉన్న వైసీపీ అభిమానులు ఆయనకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఒక చిన్నారి పాప చేతిలో పూలబొకే ఇచ్చి, “అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే జగన్ అన్న” అని చెప్పించింది. ఈ దృశ్యం చూసి జగన్ ఎంతో ఆనందించారు.
ఆ పాపను ప్రేమగా ఆశీర్వదించిన జగన్, అక్కడ ఉన్న అభిమానులకు చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పారు. ఈ అనూహ్య సర్‌ప్రైజ్ జగన్ ముఖంలో స్పష్టమైన ఆనందాన్ని నింపింది. అభిమానుల ఆత్మీయత చూసి ఆయన మురిసిపోయినట్లు కనిపించారు.
జగన్ బర్త్‌డే సందర్భంగా జరుగుతున్న ఈ ముందస్తు వేడుకలు, వైసీపీ శ్రేణుల్లో ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుతున్నాయి. ఎక్కడ చూసినా “జగన్ అన్న” నినాదాలతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి.


