బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, చిరంజీవి ప్రస్తావన, ఆర్. నారాయణమూర్తి స్పందన.. ఇవన్నీ కలిపి సినీ రంగాన్ని మళ్లీ రాజకీయ చర్చల కేంద్రంగా మార్చాయి. ఒకవైపు జగన్ పై ఉన్న అపనిందల ముద్ర చెరిగిపోయింది. టీడీపీది విష ప్రచారం అని చిరంజీవి, ఆర్ నారాయణమూర్తి లాంటి వారు కుండబద్దలు కొట్టారు. జగన్ మమ్మల్ని అవమానించలేదని.. అందరినీ సాదరంగా ఆహ్వానించాడని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమలో జగన్‌కు అభిమానులు ఉన్నా, అదే స్థాయిలో ఆయనను వ్యతిరేకించే వర్గాలు కూడా ఉన్నాయి. 2019లో ఆయనకు మద్దతుగా నిలిచిన టాలీవుడ్, 2024లో మాత్రం పూర్తిగా దూరంగా వెళ్లింది. ఇప్పుడు ఆ ఖాళీని పూడ్చుకోవడమే జగన్ లక్ష్యమని చెబుతున్నారు.
ఇందులో భాగంగా ఒక్కో ప్రముఖుడిని మీడియా ముందుకు తీసుకువస్తూ, జగన్ గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రయత్నం జరుగుతోంది. చిరంజీవి పేరు వినిపించడం, నారాయణమూర్తి వ్యాఖ్యలు రావడం, రాజమౌళి పాత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం.. ఇలా ఈ వ్యూహంలో భాగంగానే కనిపిస్తున్నాయి.
అసలు ఉద్దేశం పవన్ కళ్యాణ్ చేస్తున్న విష వ్యతిరేక ప్రచారాన్ని తగ్గించడం మాత్రమేనా? లేక సినీ రంగం ద్వారా ప్రజల్లో తాను పట్ల ఉన్న సానుకూలతను బయటకు తీసేందుకు జగన్, వైసీపీ ప్రయత్నిస్తోంది.
మొత్తానికి, జగన్ తనపై ఉన్న ముద్రను చెరిపేయడానికి సినీ రంగాన్ని మళ్లీ రంగంలోకి దింపినట్టే కనిపిస్తోంది.