వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా లండన్‌లో చదువు పూర్తి చేసుకున్న తన కుమార్తె వర్షా రెడ్డిని అభినందించారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుమార్తె వర్షారెడ్డిని ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) అందుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని గురువారం తన “X” ఖాతాలో పోస్ట్ చేశాడు. అభినందనలు
నా కూతురు ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్ నుండి గౌరవాలతో గ్రాడ్యుయేట్ చేయడం మాకు గర్వకారణం. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు.తన భార్య భారతి, కుమార్తెలు హర్షారెడ్డి, వర్షా రెడ్డిలతో కలిసి దిగిన ఈ ఫోటో వైరల్‌గా మారింది.