వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించగా, ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు అద్భుత స్వాగతం పలికారు. జగన్ ప్రయాణిస్తున్న వాహనంపై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వీధులన్నీ జనం తో కిక్కిరిసిపోయి, “జగన్ వస్తే ఇట్లుంటుందీ” అనేలా మారాయి.
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్‌పర్సన్, వైఎస్సార్‌సీపీ మహిళా నేత తిప్పరమల్లి జమలపూర్ణమ్మను కేదారేశ్వరపేటలోని ఆమె నివాసంలో జగన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక నేతలకు ఆమె ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వాకబు చేయాలని ఆదేశించారు.
జగన్ రాకతో లోటస్ రోడ్లు జనసంద్రంగా మారగా, మరోసారి ఆయనకు ఉన్న ప్రజాభిమానాన్ని విజయవాడ ఘనంగా చూపించింది.

