ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన దార్శనికతకు సజీవ సాక్ష్యంగా, రాష్ట్ర తీరంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం శరవేగంగా సాగింది. కరోనా మహమ్మారి సృష్టించిన కష్టాలు, సవాళ్లు అడ్డుకున్నా వెరవకుండా, కేవలం మూడేళ్ల స్వల్పకాలంలో 4 కొత్త పోర్టులు.. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టడం అనేది ఒక అసాధారణమైన ఘనత.
30 ఏళ్లపాటు స్థిర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న వైయస్ జగన్ రాష్ట్ర అభివృద్ధికి పోర్టులను ప్రధాన కేంద్రాలుగా ఎంచుకున్నారు. రూ. 16,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ నాలుగు పోర్టులు రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వంటి వాటిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడం మత్స్యకార కుటుంబాలకు గొప్ప ప్రయోజనాన్ని అందిస్తోంది.
ఈ పోర్టుల నిర్మాణం కేవలం మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదు. ఇది పోర్టుల ఆధారిత అభివృద్ధి ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఒక బృహత్తర ప్రణాళిక. తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతమై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తినిస్తుంది. ఈ బృహత్తర నిర్మాణాలు ప్రతి ఆంధ్రుడికి గర్వంగా, ధైర్యంగా తలెత్తుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది కేవలం నిర్మాణం కాదు, ఆంధ్రప్రదేశ్ గతిని, స్థితిని మార్చిన పటిష్టమైన ప్రణాళిక.
అయితే జగన్ ప్రారంభించి నిధులు కేటాయించిన వీటిని కూడా కూటమి ప్రభుత్వం హైజాక్ చేసింది. ఇవి చంద్రబాబు, కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందని.. మీడియాలో హైప్ పెంచుకుంటోంది. వాళ్లు కళ్లు తెరిచేలా తాజాగా వైసీపీ జగన్ సాధించిన పోర్టుల అభివృద్ధి వీడియోను పంచుకుంది. ఇది కూటమి డొల్ల తనాన్ని బయటపెడుతోంది. కూటమిప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. మీరూ ఆ వీడియోను చూడండి.

